CM KCR: నేడు సూర్యాపేటకు సీఎం.. పార్టీ తోరణాలతో గులాబీమయంగా జిల్లా కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యాలయాలు, భవనాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 10.35 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. పట్టణంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలకు సంబంధించి పూర్తయిన ప్రధాన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం పాత వ్యవసాయ మార్కెట్‌లో రూ.40 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత జిల్లా పోలీసు కార్యాలయం, సమీపంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
Read also: Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త.. వసతి గదుల టికెట్లు 25న విడుదల..!
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
అనంతరం రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటలకు కొత్త వ్యవసాయ మార్కెట్ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం పరిశీలించారు. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ కటౌట్లు, పార్టీ తోరణాలతో సూర్యాపేట జిల్లా కేంద్రం గులాబీమయమైంది. కొత్త భవనాలు విద్యుద్దీపాలలో మెరుస్తున్నాయి.
Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త.. వసతి గదుల టికెట్లు 25న విడుదల..!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!