Aadi Srinivas : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆయనను స్టేట్మెంట్ కోసం ఈరోజు విచారణకు పిలిపించారు. సీఐడీ డీఎస్పీ ఆయన స్టేట్మెంట్‌ను పూర్తిగా రికార్డ్ చేశారు. ఆది శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరసత్వం లేకపోయినప్పటికీ తప్పుడు పత్రాలను ఉపయోగించి పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఈ అంశంపై గత 15 ఏళ్లుగా పోరాటం సాగించిన శ్రీనివాస్, ఇటీవల హైకోర్టు ఇచ్చిన…
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. పదిన్నర సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు కోర్టు తెలిపింది. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్…
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అయితే.. నేడు తీర్పు వెలువడుతుందని అనుకున్నప్పటికీ.., తీర్పు వాయిదా పడింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా జర్మనీ…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వినూత్నంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మరోసారి పోటీ చేస్తారా లేక.. ఆయనకు బదులుగా కొత్తగా పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ ఇస్తారా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకులు వేములవాడలో పోటాపోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదే స్పీడ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కేడర్‌ను మరింత గందరగోళంలోకి నెడుతోందట. కొంతకాలంగా ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై వివాదం చెలరేగుతోంది. సమస్య కోర్టు…
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సిటిజన్ షిప్ యాక్ట్‌పై ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కోర్టుకు వివరించారు. ఇది చట్ట విరుద్ధమని వేదుల వెంకటరమణ కోర్టులో వాదించారు.…
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు పట్టణంలో రూ.70 నుంచి రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేష్‌బాబు తెలిపారు. ఇటీవల రూ.20 కోట్లు మంజూరయ్యాయని, దశలవారీగా అన్ని పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ 167 ఎకరాల్లో రూ.91.68 కోట్లతో ఆలయ ట్యాంకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. బండ్ నిర్మాణానికి…
టీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరారు చెన్నమనేని తరపు న్యాయవాది వై. రామారావు.. రాష్ట్ర ప్రభుత్వo, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు భౌతికంగా వాదనలు వినిపించడానికి సుముఖం వ్యక్తం చేశారు.. ఈ కేసులో.. అనేక రకమైన అఫిడవిట్‌లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున.. వాదనలకు అన్ని పార్టీలు…
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. అయితే… కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసారు చెన్నమనేని రమేష్. ఈ నేపథ్యంలోనే కౌంటర్ పిటిషన్ పై నేడు వాదనలు విననుంది హైకోర్టు. అయితే… ఇవాళ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని…
ఆయనో ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికే విపక్షాలకు టార్గెట్ అయ్యారు. ఇదే సమయంలో అధికారపార్టీలో మరో చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పోటీ చేస్తారా? కొత్త వ్యక్తి బరిలో ఉంటారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? కొంతకాలంగా జర్మనీలోనే ఎమ్మెల్యే రమేష్! చెన్నమనేని రమేష్. వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. 2009 నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. స్థానిక రాజకీయాలు ఎలా ఉన్నా.. ఆయన…