Cheguera Daughter: చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్‌కు రానున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి వైద్య సేవల కోసం కేరళ వెళ్లాడు. అయితే ఆమె అక్కడి నుంచి బయలుదేరి పలు రాష్ట్రాలను సందర్శించనున్నారు. అనంతరం ఈ నెల 22న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలకాలని అన్ని పార్టీల నేతలు నిర్ణయించారు. 22వ తేదీ ఉదయం ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత సాయంత్రం రవీంద్రభారతిలో నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ హైకోర్టు జడ్జి రాధారాణి, ప్రభుత్వ మాజీ సీఎస్ మాధవరావు, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నారు. వీరంతా వేధికపై ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం.
Read also: Negligence Doctors: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. వైద్యపరీక్షలు చేయకుండా ఆపరేషన్
అయితే, డా.అలైదా గువేరాకు ఘన స్వాగతం పలుకుతామని బీజేపీయేతర, ఎంఐఎం సంఘీభావ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం మాయత్‌నగర్‌లోని మఖ్దుంభవన్‌లో కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి, అలాగే కమిటీ సభ్యులు డిజి నర్సింహారావు, బాలమల్లేష్, టీడీపీ నాయకుడు శ్రీపతి సతీష్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్ధన్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు దిడ్డి సుధాకర్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈనేపథ్యంలో.. నాయకులు డాక్టర్ అలైద గువేరా రాక, సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఓ కరపత్రాన్ని విడుదల చేశారు.
Fit Ness Gym: జిమ్‌లో మైనర్ బాలికపై వేధింపులు.. శరీర భాగాలు తాకుతూ..