ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు సృతి మించుతున్నాయి. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఆసుపత్రిలో అధిక వసూల్లుకు పాల్పడుతున్నారు. అంటానే మనకు గుర్తుకు వచ్చేది ఠాగూర్ సినిమానే. చనిపోయిన సవానికి చికిత్సచేయడం పై ఠాగూర్ సినిమా కళ్ళకు కట్టునట్టు కనిపించేలా తీసారు. ఇలాంటి సంఘటనలే మనం చాలా చూసాం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు లక్షలు మింగుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జ్వరం వచ్చిందని వెళితే .. దాని సంబందించి కాకుండా టెస్టులు రాసించి లక్షల్లో డబ్బులు నొక్కేస్తుంటారు. ప్రజల రక్తం తాగటానికైనా వెనుకడటం లేదంటే ఎంతగా దిగజారాయో మన ప్రైవేట్ ఆసుపతరుల తంతు అని మనం చెప్పుకోవచ్చు. పోనీ ప్రాణాలతో అయినా తిరిగి పంపిస్తారా అంటే .. అది లేదు. లక్షలు తీసుకుని సజీవ సవావాలను కుటుంబాలకు అప్పగిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది.
బంజారాహిల్స్ ప్రవేట్ హాస్పటల్ లో దారుణం జరిగింది. నగరంలో నివాసముంటున్న రఘునాథ్ రెడ్డి, సువర్ణ భార్య భర్తలు. నిండుగర్భణి. ప్రసవ సమయం దగ్గర పడుతుండటంతో.. ఏప్రిల్ 24 న రెయిన్ బో ప్రైవేట్ హాస్పటల్ లో చేరింది. 12 రోజల తర్వాత కవలలను సువర్ణ జన్మనిచ్చింది. వైద్యం పేరుతో 60 అక్షలు వసూలు చేసారు రెయిన్ బో ఆసుప్రతి యాజమాన్యం. పిల్లల ప్రాణాల కంటే డబ్బులు కట్టుకుంటూ వచ్చారు సువర్ణ కుటుంబ సభ్యులు. చివరకు పుట్టిన మూడో రోజే ఒక శిశువు మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో చిన్నారి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యానికి ప్రశ్నించగా.. యాజమాన్యం ప్రయత్నం చేసాం మేము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేసారు. చికిత్స పేరుతో ఇప్పటి వరకూ 60 అక్షలు పైగా హాస్పటల్ కు చెల్లించామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సంతానాన్ని కోల్పోయామని..తల్లి తండ్రులు సువర్ణ, రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెయిన్ బో ఆసుప్రతి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములు వసూలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవని.. 2021 మే 20న.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చరించిన విషయం తెలిసిందే. అధిక ఫీజుల నియంత్రణపై టాస్క్‌ఫోర్స్ కమిటీతో మంత్రి సమీక్షించారు కూడా. ప్రభుత్వాలు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా.. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరి దీని పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.