Challa Dharmareddy: బి.ఆర్.ఎస్.ప్రభుత్వ హయాంలో పరకాల నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మించుకుంటున్న మూడువేల మంది లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వినతి పత్రం అందజేయడం జరిగింది. బి.ఆ.ర్.ఎస్.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకంలో పరకాల నియోజకవర్గంలో నూతనంగా ఇండ్లు నిర్మాణం చేపట్టిన 3000 మంది లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీల్లోని ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారులల్లోకి చేర్చాలని తెలిపారు.
Read also: Gorantla Madhav: వైసీపీలోనే చావో, రేవో.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే..!
రూ.5 లక్షల ఆర్ధిక సహాయం అందచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ను కోరారు. గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షల ఆర్ధిక సహాయం అందుతుందని ఉద్దేశంతో లబ్దిదారులంతా పాత గృహాలు కూల్చేసి నూతన ఇండ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. ప్రతి లబ్ధిదారుల ఇంటికి అధికారులు నేరుగా పరిశీలించి మంజూరు పత్రాలు అందచేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే గృహలక్ష్మి పథకం రద్దు చేసినట్లు ఉత్తర్వులు విడుదల చేశారు. మల్లి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటిస్తే ప్రస్తుతం పురోగతిలో ఉన్నఇండ్ల లబ్ధిదారులు రోడ్డున పడుతారని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని అన్నారు.