Chain Snatchers: నార్సింగిలో చైన్ స్నాచర్స్ వీరంగం.. మహిళ మెడలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chain Snatchers: హైదరాబాద్‌లో ఇటీవల చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. పోలీసుల నిరంతర నిఘా, సీసీ కెమెరాల వల్ల కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఒక్కసారిగా చైన్ స్నాచింగ్ కేసులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హడల్ ఎత్తిస్తున్నారు. తెంపుడుగాళ్ళు రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది
హైదరాబాద్ లోని నార్సింగిలో చైన్ స్నాచర్స్ హల్ చల్ సృష్టించారు. తిరుమల హిల్స్ లో నడుచుకుంటూ వెళుతున్న అరుణ అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు స్నాచింగ్. మోటర్ సైకిల్ పై వచ్చిన దుండగులు మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్ చేసి పారిపోయారు. నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో చైన్ స్నాచింగ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు. సీసీ టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు కాప్స్.
Also Read
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
Read also: Playing Cards, Cock Fights In Forest: నర్సాపూర్ అడవుల్లో పేకాట, కోళ్ల పందాలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొదట ఆగష్టు 13 శంషాబాద్ పోలీస్టేషన్ పరిధి లో ఉట్ పల్లి లో టైలరింగ్ షాపులోకి వచ్చిన స్నాచర్ లక్ష్మి అనే మహిల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెల తాండు ఎత్తుకెళ్ళాడు. రాజేంద్రనగర్ పోలీస్టేషన్ కు కూతవేటు దూరంలో బుద్వేల్ బస్టాఫ్ వద్ద బస్ కోసం వేచి ఉన్న సత్యవతి అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెల తాడు తెంపుకుని పరారయ్యాడు. ఆర్జీఐఏ పోలీస్టేషన్ పరిధి అర్బీనగర్ లో పాల ప్యాకెట్ కోసం వెళ్తున్న గడ్డం అనిత అనే మహిళ మెడలో నుంచి 3.1/2 తులాల బంగారం పుస్తెల తాండు ఎత్తుకెళ్ళాడు.
ఇక తాజాగా.. నార్సింగ్ పోలీస్టేషన్ పరిధి తిరుమల హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న అరుణ అనే మహిళ బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా స్కూటిపై వచ్చిన తెంపుడుగాడు 3.1/2 తులాల పుస్తెల తాండు లాక్కోని వెళ్ళాడు శంషాబాద్ స్నాచర్ ను గుర్తించక ముందే రాజేంద్రనగర్, ఆర్జీఐఎ, నార్సింగ్ పోలీస్టేషన్ పరిధిలో స్నాచింగ్ లు జరగడం పోలీసులకు సవాల్ గా మారింది. వరుస చైన్ స్నాచింగ్ లు జరుగుతుండడంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక పోలీసు టీంలను రంగంలోకి దింపి సీసీ కెమెరాల అధారంగా నింధితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుని ఫోటోను విడుదల చేశారు. నిందితుని ఎవరైన గుర్తిస్తే సమీపంలోని పోలీస్టేషన్ కు సమాచారం అందివ్వాలని సూచించారు.
Delhi Liquor Scam: మరో ట్విస్ట్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విశాఖ వాసులు?
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!