హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. చైన్ స్నాచింగ్ ఘటనలతో అప్రమత్తమయ్యారు రాష్ట్ర పోలీసులు. తెల్లవారు జామునుంచే స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై పోలీసుల తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని నార్సింగీలో చైన్ స్నాచర్స్ హల్ చల్ సృష్టించారు. తిరుమల హిల్స్ లో నడుచుకుంటూ వెళుతున్న అరుణ అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు స్నాచింగ్. మోటర్ సైకిల్ పై వచ్చిన దుండగులు మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్ చేసి పారిపోయారు.