Bengaluru: బెంగళూర్ నగరంలో డబుల్ మర్డర్ కలకలం సృష్టించింది. 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేయగా.. ఆమె తల్లి హంతకుడిని చంపేసింది. ఈ ఘటన గురువారం జయనగర్‌లోని సారక్కి పార్క్‌లో జరిగింది. మృతురాలిని అనూషగా, మృతుడిని 44 ఏళ్ల సురేష్‌గా గుర్తించారు. వీరిద్దరికి ఐదేళ్లుగా పరిచయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ పార్క్‌లో అనూష, సురేష్ మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొన్నాళ్లుగా అనూష్, సురేష్‌కి దూరంగా ఉంటోంది. అతడితో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో సురేష్ ఆమెని రెండుసార్లు కత్తితో పొడిచారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Read Also: Earthquake: టర్కీలో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.6గా నమోదు
అనూష తన ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు.. పార్కులో ఒక వ్యక్తిని కలవాలని, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పింది. అనుమానించిన తల్లి అనూషను వెంబడించి పార్కుకు వెళ్లింది. తల్లి కళ్ల ముందే కూతురిని హత్య చేస్తుండటం చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే సురేష్‌ని తలపై రాయితో కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. అనూషను రక్షించేందుకు ఆమె తల్లి బండరాయితో కొట్టడంతోనే సురేష్ మరణించాడని, మేము ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నామని ప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేశ్ భరమప్ప జగలాసర్ తెలిపారు.
అనూషకు ఛాతీ, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మరణించినట్లు ఆయన వెల్లడించారు. మృతులు ఇద్దరు ఒకరికి ఒకరు తెలుసు. ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు. అనూష ఒక కేర్‌టేకర్, సురేష్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేశాడు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య సంబంధం ఉంది. అయితే, అనూష ఇటీవల అతడిని దూరం పెట్టడం ఈ సంఘటన జరిగిందని డీసీపీ వెల్లడించారు. మృతురాలి తల్లిని ప్రశ్నిస్తున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.