80 lakh Car Burnt: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్న అక్కసుతో రూ.80లక్షల విలువైన స్పోర్ట్స్ కారును తగులపెట్టిన ఘటన పహాడిషరీఫ్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: Balayya : బాలయ్యతో బోయపాటి మరో పొలిటికల్ మూవీ..?
నార్సింగ్ కు చెందిన నీరజ్ అనే వ్యాపారి 2009 మాడల్కి చెందిన డిఎల్ 09 సివి 3636 నెంబర్ గల లంబోర్ఘిని స్పోర్ట్స్ కారు ను సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేశాడు. ప్రస్తుతానికి ఆ కొత్త కారు సుమారు రూ.4కోట్ల విలువ ఉంటుంది. ఆ కారు షోకు తీరగానే నీరజ్ విక్రయించాలనుకున్నాడు. ఈ నేపధ్యంలోనే తనకు పరిచయమం ఉన్న అయాన్ అనే వ్యక్తికి చెప్పాడు. దీంతో అయాన్ తన స్నేహితుడైన మొఘల్పురాకు చెందిన అమన్ కు చెప్పాడు. కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమన్ కు, అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. దీంతో మామిడిపల్లి టు శంషాబాద్ రూట్ కు వెళ్లే రహదారిలో ఉన్న ఫాం హౌజ్ కు తీసుకురావాలని అహ్మద్ చెప్పాడు. కాగా.. నీరజ్ దగ్గర నుంచి అయాన్ కారు తీసుకువచ్చి అమన్ కు ఇచ్చాడు. అయితే.. అమన్ అతని స్నేహితుడు హందాన్ తో కలిసి జల్పల్లిలో ఆ స్పోర్ట్స్ కారును తీసుకుని మామిడి పల్లిలోని వివేకానంద స్టాచ్ దాటి ఎయిర్ పోర్ట్ రూట్ మధ్యలో ఆపారు.
Read also: Ponnam Prabhakar: బలహీన వర్గాలు ఆలోచించండి .. ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడండి..
అహ్మద్ తో పాటు మరి కొంత మంది కారు వద్దకు చేరుకొని నీరజ్ ఎక్కడ ? అతను మాకు డబ్బులు ఇవ్వాలని అంటూ వారిపై దుర్భాషలాడారు. నీరజ్ ను పిలిపిస్తామని చెప్పిన వినకుండా అహ్మద్ వెంట వచ్చిన వారు బాటిలో తెచ్చుకున్న పెట్రోల్ ను స్పోర్ట్స్ కారుపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అమన్ డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పహాడిషరీఫ్ పోలీసులు, ఫైయిర్ ఇంజన్ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్దమయ్యింది. సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత్ రెడ్డి, పహాడిషరీప్ ఇన్ స్పెక్టర్ గురువారెడ్డి, ఎస్ఐ మధుసూధన్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే అప్పు ఇవ్వలేదని ఇలా చేశాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే రీతిలో దర్యాప్తు చేస్తున్నారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..