KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం..
- ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం..
- పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు - కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఇవ్వాళ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు చెట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని స్పష్టం చేశారు.
Read also: Tech Tips: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయాలంటే ఈ టిప్స్ పాటించండి?
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read also: Foldable iPhone:యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది!
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని… పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!