KTR: కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పార్టీలు, వేడుకలకు అతీతంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు కేటీఆర్. పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వచ్చిన పారిశుధ్య కార్మికులతో కేటీఆర్ సరదాగా ముద్దులు దిగి సెల్ఫీలు దిగారు. అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కార్మికులందరికీ హారతి ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్ భోజనం చేశారు. పారిశుధ్య కార్మికులకు కరచాలనం చేస్తూ కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. వారితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను కేటీఆర్ అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Read also: Telangana Police: పోలీసులకు సేవా పతకాలు.. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు శౌర్య పతకం
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ద్వారా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ కృషి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. కనీస వేతనంతో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచి… గౌరవంగా బతికేలా చేశామన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ లీవ్ సౌకర్యాలు కల్పించాలని… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్‌కు బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకుని కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పూలమాలలు సమర్పించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Police: పోలీసులకు సేవా పతకాలు.. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు శౌర్య పతకం
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!