Telangana Police: పోలీసులకు సేవా పతకాలు.. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు శౌర్య పతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Police: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు తెలంగాణ సర్కార్ సేవా పతకాలను ప్రకటించింది. పోలీస్ శాఖలోని అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి అన్ని విభాగాల్లో మొత్తం 636 మంది సిబ్బందికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది. వాటిలో 7 శౌర్య పతకాలు, 9 అత్యుత్తమ సేవా పతకాలు, 89 ఉత్తమ సేవా పతకాలు, 42 హార్డ్ సర్వీస్ మెడల్స్, 435 సేవా పతకాలు ప్రకటించారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర గ్యాలంట్రీ మెడల్‌కు కే ఉపేందర్ (జేసీ 4528 గ్రేహౌండ్స్) ఎంపికయ్యారు. మంద నవీన్ (సబ్-ఇన్‌స్పెక్టర్-రాచకొండ), వేలేటి మనోహర్ రావు (సబ్-ఇన్‌స్పెక్టర్-రాచకొండ), ఎం షడ్రక్ (సిట్-హైదరాబాద్), గజాడి మల్లేశం (అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్-సైబరాబాద్) మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి సయ్యద్ నయీముద్దీన్ జావీద్ (ఏసీపీ రోడ్ సేఫ్టీ-రాచకొండ), జి.రణవీర్ రెడ్డి(ఏసీపీ-మాదాపూర్ ట్రాఫిక్), ఎస్.శ్రీనివాసులు(ఏసీపీ-బాలానగర్ ట్రాఫిక్) ఎంపికయ్యారు.
Read also: Asaduddin Owaisi: రామమందిరంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
ఇలా విభాగాల వారీగా..
* అవినీతి నిరోధక శాఖలో ఐదుగురికి ఉత్తమ సేవ, ముగ్గురికి సేవా పతకాలు
* విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో మూడు మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్
* విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఏడుగురికి సేవా పతకాలు
* డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మరియు ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఆరుగురికి గ్యాలంటరీ పతకాలు
* విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక విభాగంలో ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు
* విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక విభాగంలో 13 మందికి సేవా పతకాలు.
* గ్రేహౌండ్స్‌కు చెందిన కానిస్టేబుల్ ఉపేందర్‌కు శౌర్య పతకం లభించింది
* పోలీసు శాఖలో 9 మందికి సేవా పతకాలు
* TSSPF ఒకరికి విశిష్ట సేవా పతకాన్ని, నలుగురికి ఉత్తమ సేవా పతకాన్ని అందించింది.
Raj Kumar Hirani: రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉంది కానీ…
తాజావార్తలు
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!