Site icon NTV Telugu

KTR-Harish Rao: కవితను కలిసేందుకు ఢిల్లీకి కేటీఆర్‌, హరీష్‌ రావు..

Ktr Harish Rao

Ktr Harish Rao

KTR-Harish Rao: ఇవాళ కవితను కలిసేందుకు మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్‌ సామ్‌ లో అరెస్ట్‌ అయిన కవితను ఇవాళ ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్‌, హరీష్‌ రావులు కలిసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమయం కేటాయించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అవకాశం కల్పించింది. ఈనేపథ్యంలో భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌ తో సహా హరీష్‌ రావు, ప్రణీత్‌, న్యాయవాదులు కలిసే అవకాశాలు వున్నాయి. కాగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈడీ ఆమె భర్త అనిల్‌కు నోటీసులు పంపింది. సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. కవిత భర్త అనిల్, ఆమె పీఆర్వో రాజేష్ మరో ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

Read also: Janvikapoor : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న దేవర బ్యూటీ..

ఈ కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ అధికారులు నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పేరు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు లబ్ధి పొందేందుకు తమ పార్టీ నాయకురాలు కవితపై తప్పుడు కేసులు బనాయించి, కేసులు పెట్టి, అరెస్టు చేశారని నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడంలో అంతరార్థం ఏమిటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రజా కోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పేరును చెడగొట్టేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని గుర్తు చేశారు. కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా శనివారం నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.
Dhanashree Verma: మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు.. మనుషులుగా ఆలోచించండి! చహల్‌ సతీమణి ఫైర్

Exit mobile version