Zero Shadow day: ఇవాల హైదరాబాద్‌లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటలకు ‘జీరో షాడో డే’ అనే ఛాయ కనిపించలేదు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ ఖగోళ అద్భుతానికి ఈసారి హైదరాబాద్ నగరం వేదికైంది. ఎప్పుడూ మనల్ని వెంటాడే నీడకు దూరంగా ఉండే అరుదైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం మనకు మాత్రమే దక్కింది. సూర్యకిరణాలు నిటారుగా 90 డిగ్రీల కోణం ఉంచిన ఏ వస్తువు యొక్క నీడ రెండు నిమిషాలు అంటే 12:12 నుండి 12:14 వరకు కనిపించలేదు. ఎండలో నిలబడినా మన నీడ కనిపించలేదు. కమాన్.. సెలబ్రేట్ చూసుకోండి.. జీరో షాడో డే.. అంటూ హైదరాబాదీలు ఎంజాయ్ చేశారు. సరిగ్గా 12 గంటల 12 నిమిషాలకు హైదరాబాద్ నగరాన్ని సూర్యకిరణాలు తాకాయి. మన హైదరాబాదీలకు ఇదో అరుదైన అనుభవం. ఇలా మాయమైన నీడ.. రెండు నిమిషాల తర్వాత మళ్లీ ప్రత్యక్షమైంది.
ఇక అదే విధంగా ఆగస్టు 3న హైదరాబాద్‌లో జీరో షాడో డే ను కూడా నిర్వహిస్తామని వివరించారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో దాదాపు అన్ని ప్రాంతాల్లో నీడ కనుమరుగవుతుందన్నారు. ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12.17 గంటలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడలు రెండు నిమిషాల పాటు మాయమయ్యాయి.
జీరో షాడో డే అంటే?
ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) వివరాల ప్రకారం… జీరో షాడో సమయంలో ఏ వస్తువుపైనా, మనిషిపైనా నీడ కనిపించదు. దీనిని సాంకేతిక పరిభాషలో జెనిత్ పొజిషన్ అంటారు. ఈ కారణంతోనే జీరో షాడో డే జరుగుతుంది. ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందని వెల్లడైంది. ఇది కర్కాటక రాశి, మకరరాశి మధ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. జీరో షాడో సమయంలో సూర్యుని అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యుని కాంతి మనిషి పరిధిదాటి పోలేదు. అందుకే నీడ పడదు.
ఎందుకు జరుగుతుంది..?
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, దాని భ్రమణ అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ క్రమంలో మన వాతావరణం మారిపోతోంది. అంటే… వెలుతురు తీవ్రతలో మార్పు వస్తుంది. ఎండ కాయ మధ్యలోకి వచ్చింది..అందుకే ఎండలు మండిపోతున్నాయని అనుకుంటున్నాం. కానీ… సూర్యుడు నట్ట నడి నెత్తికి రెండు సార్లు మాత్రమే తగులతాడు. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో మరోసారి జరుగుతాయి. అప్పుడే సూర్యుడు సరిగ్గా మధ్యలోకి వస్తాడు. దీనిని అత్యున్నత స్థానం అంటారు. సాంకేతికంగా చెప్పాలంటే, సూర్యుడు మకరం మరియు కర్కాటకం మధ్య +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ దృగ్విషయం జరుగుతుంది. సరిగ్గా కేంద్రీకృతమై ఉండటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. అందుకే మన నీడ కనిపించదు.
Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు..!