Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మెపై ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయితీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని మండిపడ్డారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదా? అంటూ లేఖలో పేర్కొన్నారు. మీ ప్రభుత్వం దేశంలోనే మా పంచాయితీలు ఆదర్శం అందుకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందని గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు.
Read also: MLA Muthireddy: ప్రత్యర్ధులు నా బిడ్డను నాపై ఉసిగొలిపారు.. ఎలాంటి ఫోర్జరీ జరగలేదు
ఆ గొప్పల వెనుక జూనియర్ పంచాయితీ కార్యదర్శులు పడిన శ్రమ ఉందని అన్నారు. వారి కష్టంతో రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తు చేశారు. ఇంత చేసి మీకు అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా వేధించడం సరైంది కాదని హెచ్చరించారు. వారి కష్టానికి మీ ప్రభుత్వం ఇచ్చే రీవార్డు ఇదేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం మీ దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. ఎంతో పనిభారం పెరిగినా భరిస్తూ రెగ్యులర్ చేస్తారని వారు ఆశగా ఎదురు చూశారని అన్నారు. నాలుగేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ముగిసినా తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా! అంటూ వ్యంగాస్త్రం వేశారు. ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచి, వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని తెలిపారు.
రేవంత్ డిమాండ్..
• జూనియర్ పంచాయితీ కార్యదర్శులు కోరుకుంటున్న విధంగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి.
• 4 సంవత్సరాల సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలి.
• కేడర్ స్ట్రెంట్ తోపాటు సర్వీసును రూపొందించాలి.
• 010 పద్దు కింద వేతనాలిస్తూ EHS కార్డులను అందజేయాలి.
• చని పోయిన పంచాయితీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలి.
• OPS (Out Sourcing Secretary) వారిని కూడా రెగ్యులర్ చేయాలి.
• ఇతర శాఖల్లోని ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా మహిళా పంచాయితీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలి.
BIG Breaking: రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన