Site icon NTV Telugu

BRS Silver Jubilee Meeting: రేపే బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు

Brs

Brs

BRS Silver Jubilee Meeting: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి.. ఎన్ని అవమానాలు ఎదురైనా.. ఉద్యమమే ఊపిరిగా.. రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న కసితో పోరాడి చివరకు అనుకున్న చేరుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27వ తేదీన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఈ గులాబీ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఇక, 2022లో టీఆర్ఎస్‌ను కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి (BRS)గా మార్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న ఈ కారు పార్టీ ఆవిర్భవించి రేపటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రజతోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది.

Read Also: IPL 2025: టాస్ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌.. బ్యాటింగ్ ఎవరిదంటే?

కాగా, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో రేపు (ఏప్రిల్ 27వ తేదీన) నిర్వహించబోతున్నారు. ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారు పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా మరోసారి చూపించాడానికి సిద్ధమైంది. ఇందు కోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరో 154 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు. అలాగే, వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది.

Read Also: Chiranjeevi : మే9న మెగా ఫ్యాన్స్ కు పండగే.. అటు చిరు.. ఇటు చరణ్‌

అలాగే, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 10 లక్షల వాటర్ బాటిల్స్, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 అంబులెన్స్‌లు, 12 వైద్య శిబిరాలు, 1,200 తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక, పార్కింగ్ కోసం 2,000 మంది వాలంటీర్లు నిరంతరం విధులు నిర్వహించనున్నారు. అంతేకాదు.. విద్యుత్ సమస్య రాకుండా 250 జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఇక, ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలి రానున్నారని పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే.. 3000 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంది. ఈ బస్సులే కాకుండా.. డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, వ్యాన్లు ఇలా వేల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్‌లతో జనాలను వరంగల్ సభకు తరలించనున్నారు.

Read Also: ACB: ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై కొనసాగుతున్న సోదాలు

అయితే, చాలా రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ దళపతి కేసీఆర్ చేయబోయే ప్రసంగం గురించి రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన, పథకాల అమలు, కాంగ్రెస్ నేతల విమర్శలు ఇలా అన్నింటిపై ఆయన ఎలా రియాక్ట్ ఆవుతారోనని అందరు ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేలా, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికలను కూడా ఇదే వేదిక నుంచి కేసీఆర్ వివరించే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version