KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో రేపు (ఏప్రిల్ 27వ తేదీన) నిర్వహించబోతున్నారు. ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారు పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా మరోసారి చూపించాడానికి సిద్ధమైంది.
టీఆర్ఎస్ కి ఒక విశిష్టత ఉంది.. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయి.. ఇక, తెలంగాణ ప్రజల గొంతుగా పార్టీ పేరు తెచ్చుకుంది టీఆర్ఎస్.. ప్రజలు ఏ బాధ్యత ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్న పార్టీ అని కేటీఆర్ పేర్కొన్నారు.