ఐపీఎల్-2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఈరోజు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బౌలింగ్ చేయనున్న కోల్‌కతా నైట్‌రైడర్స్. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. అంతకుముందు, ఈ రెండు జట్లు ముల్లన్‌పూర్‌లో తలపడ్డాయి, దీనిలో పంజాబ్ 111 పరుగుల స్కోరును కాపాడుకుంది. ఇప్పుడు కోల్‌కతా తన సొంతగడ్డపై జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.