Sangareddy Crime: చెల్లిని ప్రేమిస్తున్నాడని.. యువకుడి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brother Killed His Sister Boyfriend In Sangareddy Thanda: సంగారెడ్డిలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఒక యువకుడ్ని ఆమె అన్నయ్య అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అందరూ చూస్తుండగానే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచ్చరేగడి తండాలో సుదీప్ (19) అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలం నుంచి అతడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇన్నాళ్లూ తన ప్రేమ విషయాన్ని గుట్టుగానే దాచాడు. కానీ.. ఇటీవల యువతి సోదరుడు అరుణ్‌కి (19) ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి అతడు సుదీప్‌పై కక్ష పెంచుకున్నాడు. తన చెల్లి జోలికి రాకుండా ఉండాలంటే, అతడ్ని అంతమొందించాల్సిందేనని నిర్ణయించుకున్నాడు.
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
అంతే.. అనుకున్నదే తడువుగా సుదీప్‌ని హతమార్చేందుకు అరుణ్ గొడ్డలి పట్టుకొని బయలుదేరాడు. సుదీప్ ఎక్కడున్నాడో తెలుసుకుని, నేరుగా అక్కడికే వెళ్లి అతనిపై గొడ్డలితో దాడి చేశాడు. నా చెల్లెలినే ప్రేమిస్తావా? అంటూ దాడికి పాల్పడ్డాడు. గొడ్డలితో తలపై దాడి చేయడం వల్ల.. సుదీప్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. పబ్లిక్‌లోనే అరుణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతడు దాడి చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్లు చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప, ఎవ్వరూ ఆపడానికి సాహసం చేయలేదు. సుదీప్ చనిపోయాడని నిర్ధారించుకొని, అరుణ్ అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. మరోవైపు సుదీప్ మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అరుణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..