తెలంగాణ సిఎం కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌చుగ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో యుద్ధం నడుస్తుందని.. అది ఆత్మగౌరవనికి, అహంకారానికి మధ్య యుద్ధం నడుస్తుందన్నారు. ఈటల బీజేపీలోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడిపోవడమని విమర్శలు చేశారు. ఒక్క వ్యక్తి, అతని కుటుంబం చేస్తున్న అరాచకాల మీద ఈటల గొంతు వినిపించారన్నారు. ఇన్నాళ్లు ఈటల trsలో సంఘర్షణ పడ్డారని…తనను నమ్మిన ప్రజల బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నించారని తెలిపారు. కెసిఆర్ కు ఆయన కుటుంబం ఎక్కువ అయిందని.. ఈటల పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుందన్నారు. మా అందరి ఉదేశ్యం ఒక్కటేనని.. కేసీఆర్ అహంకారం… రాజరికం తెలంగాణ నుండి పోవాలని పేర్కొన్నారు. తెలంగాణ వికాసం కోసం ఎవరితో అయిన కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.