Jan Aushadhi Kendra: సామాన్యులకు ఖరీదైన మందులను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాలను (JAN AUSHADHI KENDRA) ప్రారంభించింది. మధుమేహం, రక్తపోటు, గుండె ఇతర తీవ్రమైన వ్యాధులకు మందులు ఈ జన్ ఔషధి కేంద్రాలలో సుమారు 50 నుండి 90 శాతం తగ్గింపుతో లభిస్తాయి. ఇప్పుడు ఈ జన్ ఔషధి కేంద్రాల నెట్‌వర్క్‌ను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 10,000 కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also:New Bride Escape: నగదుతో నవ వధువు ఎస్కేప్.. లబోదిబోమంటున్న కొత్త పెళ్లి కొడుకు
దేశంలో పెరగనున్న జనౌషధి నెట్‌వర్క్
బ్యూరో ఆఫ్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఆఫ్ ఇండియా (PMBI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రవి దధిచ్ మాట్లాడుతూ, “ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 10,000 జన్ ఔషధి కేంద్రాలు పనిచేస్తాయని భావిస్తున్నారు. మే 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మొత్తం 9,484 జన్ ఔషధి కేంద్రాలు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. గురుగ్రామ్‌లోని సెంట్రల్ వేర్‌హౌస్‌లో దధీచ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP) కింద దేశవ్యాప్తంగా గురుగ్రామ్, చెన్నై, గౌహతి, సూరత్‌లలో నాలుగు దుకాణాలు ఉన్నాయి. గురుగ్రామ్‌లోని సెంట్రల్ వేర్‌హౌస్ అతిపెద్దది. PMBJP ప్రస్తుతం 1,800 మందులతో పాటు 285 సర్జికల్ పరికరాలను చాలా సరసమైన ధరలకు నాణ్యతలో రాజీ పడకుండా అందజేస్తోందని దధీచ్ తెలియజేశారు.
Read Also:Rahul Gandhi: ప్రతేడాది ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
సహకార సంఘాల్లో జన్ ఔషధి కేంద్రాల ప్రారంభం
ఈ ఏడాది ఆగస్టు నాటికి సుమారు 1,000 జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభమవుతాయని, మిగిలిన జన్ ఔషధి కేంద్రాలు డిసెంబర్ నాటికి ప్రారంభమవుతాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జన్ ఔషధి కేంద్రాలను తెరవడానికి పీఏసీఎస్ కమిటీలకు అనుమతి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 2,000 పీఏసీఎస్ కమిటీలను ఎంపిక చేయనున్నారు. “ఈ ముఖ్యమైన నిర్ణయం PACS సొసైటీల ఆదాయం, ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, ప్రజలకు సరసమైన ధరలో ఔషధాలను అందుబాటులో ఉంచుతుంది” అని సహకార మంత్రిత్వ శాఖ పేర్కొంది.