BJP MLA Raja Singh Criticized TRS Leaders.
కేంద్రం కోటాలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీజేపీ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలతో టీఆర్ఎస్ మరో పచ్చి అబద్దానికి తెరలేపారన్నారు. గత ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా 700 మంది నిరుద్యోగుల చావుకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వమని, ఇయ్యాల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా… 80 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెబుతూ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చనిపోయిన 700 మంది కుటుంబాలకు ఏం సమాధానం చెబుతవ్ కేసీఆర్? పైగా కేంద్రం ఉద్యోగాలు భర్తీ చేయలేని దుష్ప్రచారం చేస్తవా…ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ప్రతి ఏటా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, బీఆఎస్సార్బీ, ఎన్డీఏ వంటి సంస్థల ద్వారా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఉందని ఆయన వెల్లడించారు.
అందుకోసం ప్రతి ఏటా రెగ్యులర్ గా క్యాలెండర్ ను విడుదల చేస్తోందని, దాని ప్రకారమే ఉద్యోగాలను నింపుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న 15 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేసే ప్రక్రియ నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ సహా వివిధ దశల్లో కొనసాగుతూనే ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని నిందించడమంటే…. ఆకాశంపై ఉమ్మేయడమే అవుతుందని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఫ్రభుత్వానికి ఉద్యోగ క్యాలెండర్ వేయడం చేతకాదు… ఏటా ఉద్యోగాలు నింపడం చేతకాదు… ఆ పని చేస్తున్న కేంద్రం మీద విషం చిమ్మడం ఎంత వరకు కరెక్ట్? అని ఆయన ప్రశ్నించారు.