BJP Leaders Besieged Kavita House: MlC కవిత ఇంటి ముట్టడి కేసులో 26 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేసారు పోలీసులు. 26 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసారు. అయితే.. ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను వర్చువల్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నిన్న రాత్రి నుండి నాటకీయ పరిణామాలు మధ్య కేసులు నమోదైంది. ఇప్పటికే అరెస్ట్ అయిన కార్యకర్తలపై పోలీసులు మూడు సార్లు సెక్షన్ల లను మార్చారు. నిన్న సాయంత్రం 341, 148, 353, 509 , 149 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మధ్యరాత్రి వైద్య పరీక్షలు కోసం గాంధీ ఆస్పత్రికి తరలించిన సమయంలో ఐపీసీ 307 కింద కేసులు బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసారు. ఈరోజు ఉదయం మూడో సారి సెక్షన్ల లను మార్చి 307 ను పోలీసులు తొలగించారు. రాజకీయ ఒత్తిళ్లు వలన ఇప్పటికే మూడు సార్లు సెక్షన్ల మార్చారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రిమాండ్ కి తరలింపు పై ఉత్కంఠ కొనసాగుతుంది.
కాగా.. ఎమ్మెల్సీ కవిత ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పరామర్శించి, సంఘీభావం తెలిపారు. వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటి పైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అని మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మేమంతా అక్కడ ఉన్నాం, బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదు, మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన విషయం తెలిసిందే.
Munugode Election : మునుగోడులో ఎన్నికలు ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి ఒక ఎత్తు