సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతోన్న అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకానికి సంబంధించి ప్రగతిభవన్‌లో అఖిలపక్ష భేటీ ప్రారంభం కాగా.. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ నేతలకు, ఇక, దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర నాయకులకు ఆహ్వానాలు వెళ్లాయి.. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డి, ఎంఐఎం నుంచి బలాలా, పాషా ఖాద్రి, కొంత మంది దళితల నేతలు హాజరయ్యారు.. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడంతో.. ఆ పార్టీ ఫోర్ల్ లీడర్ రాజాసింగ్ హాజరుకాలేదు.. కానీ, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈ సమావేశంలో పాల్గొనడం చర్చగా మారింది. సీనియర్ దళితల నేతలను కూడా అఖిలపక్ష భేటీకి ఆహ్వానించడంతో.. తనకు అందిన ఆహ్వానం మేరకు మోత్కుపల్లి.. వెళ్లినట్టుగా తెలుస్తోంది.