తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అబద్ధాలు ఆడరని ఆమె మండిపడ్డారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
Read Also: వడ్ల కొనుగోలుపై తెగని పంచాయితీ..కేంద్రంపై రెచ్చిపోయిన హరీష్‌రావు
కేసీఆర్‌ను ఎవరైనా తిడితే కేసులు పెడతారని.. మరి ఇద్దరు కేంద్రమంత్రులను తిట్టిన కేసీఆర్‌ను ఏం చేయాలని డీకే అరుణ ప్రశ్నించారు. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ మైండ్ బ్లాక్ అయినట్లు ఉందని ఆమె ఎద్దేవా చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోకుండా కేసీఆర్ పిచ్చికూతలు కూస్తున్నారని డీకే అరుణ ఫైర్ అయ్యారు.