కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ… కేసీఆర్ అహంకారం అణగాలి అంటే ఈటల రాజేందర్ గెలవాలి. తెలంగాణలో అభివృద్ధి చెందింది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ప్రజల తరపున మాట్లాడుతున్నారు అని ఈటెల రాజేందర్ కి మంచి పేరు వచ్చింది అని కేసీఆర్ కి కడుపుమండింది. ఈటల రాజేందర్ బయటికి నెట్టిన కేసీఆర్ నీ తెలంగాణ నుండి బయటికి నెట్టాలి. లేందంటే మనకు భవిష్యత్తు ఉండదు. ఈటల రాజేందర్ అహర్నిశలు అభివృద్ధి కోసం కృషి చేశారు. మీ అండగా ఉండే ఈటల ను గెలిపించుకుందామా… కేసీఆర్ నిలబెట్టిన డమ్మీ నా అని ప్రశ్నించారు. నియంత పాలన అంతానికి మంచి అవకాశం ఇది. తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ భవిష్యత్తును మార్చుకుందాం. నియంతకు ముక్కు తాడు వేద్దాం అని పేర్కొన్నారు.