డా.బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా నేడు తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని.. భారత ప్రజలను, అంబేద్కర్‌ను సీఎం కేసీఆర్ అవమానించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్‌కు సామాజిక స్పృహ లేదని, జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచొచ్చని ఆయన వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లు కేసీఆర్ తగ్గించారని మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని…