NTV Telugu Site icon

BRS Party: బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న ఆ నలుగురు

Cn Kcr

Cn Kcr

BRS Party: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వరుస షాక్ లు తగులుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, బీజేపీ నేతలు దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో నర్సపూర్ లో జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభలో చేరనున్నారు. కాగా.. నర్సాపూర్‌ టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గాలి అనిల్‌ కుమార్‌ నిన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయగా.. ఇక మరోవైపు సంగారెడ్డి నుంచి దేశ్ పాండేకి టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో పులిమామిడి రాజుకి బీజేపీ బీ-ఫామ్ ఇవ్వడంతో అప్పటి నుంచి పార్టీపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇక నర్సాపూర్, పటాన్ చెరు నుంచి టికెట్ ను సింగాయపల్లి గోపి, శ్రీకాంత్ గౌడ్ ఆశించిన టికెట్లు రాకపోవడంతో అసంతృప్తితో వీరితో మంత్రి హరీష్ రావు మంతనాలు జరిపారు. ఈ రోజు నర్సాపూర్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో గాలి అనిల్ కుమార్, దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ నలుగురు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.

ఇక, గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతల తీరుతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ దీనస్థితిలో ఉన్న సమయంలో ఆ పార్టీ జెండాను మోసింది తానేనని ఆయన గుర్తు చేశారు. అయితే.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, ఖర్చుకు వెనుకాడలేదన్నారు. కానీ.. ఇప్పుడు టికెట్‌ ఇచ్చే సమయంలో పార్టీ రాష్ట్ర నేతలు వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు. దీంతో పార్టీ కోసం 24 గంటలు కష్టపడిన వారిని కాదని టికెట్‌ కావాలని అప్లికేషన్‌ కూడా పెట్టని వారికి టికెట్‌ కేటాయించడం అన్యాయమన్నారు. ఇందులో.. అప్లికేషన్‌ పెట్టని 40మందికి టికెట్లు ఇచ్చారని గాలి అనిల్ కుమార్ ఆరోపించారు. బీసీలకు న్యాయంగా 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ మొండిచెయ్యి చూపించింది. కాంగ్రెస్‌లో కష్టపడిన వారికి న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి మేరకు, వారి మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రాథమిక సభ్యత్యానికి, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

Farzi : మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ గా నిలిచిన ఫర్జి..