BRS Party: బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న ఆ నలుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Party: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వరుస షాక్ లు తగులుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, బీజేపీ నేతలు దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో నర్సపూర్ లో జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభలో చేరనున్నారు. కాగా.. నర్సాపూర్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గాలి అనిల్ కుమార్ నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా.. ఇక మరోవైపు సంగారెడ్డి నుంచి దేశ్ పాండేకి టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో పులిమామిడి రాజుకి బీజేపీ బీ-ఫామ్ ఇవ్వడంతో అప్పటి నుంచి పార్టీపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇక నర్సాపూర్, పటాన్ చెరు నుంచి టికెట్ ను సింగాయపల్లి గోపి, శ్రీకాంత్ గౌడ్ ఆశించిన టికెట్లు రాకపోవడంతో అసంతృప్తితో వీరితో మంత్రి హరీష్ రావు మంతనాలు జరిపారు. ఈ రోజు నర్సాపూర్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో గాలి అనిల్ కుమార్, దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ నలుగురు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
ఇక, గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల తీరుతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ దీనస్థితిలో ఉన్న సమయంలో ఆ పార్టీ జెండాను మోసింది తానేనని ఆయన గుర్తు చేశారు. అయితే.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, ఖర్చుకు వెనుకాడలేదన్నారు. కానీ.. ఇప్పుడు టికెట్ ఇచ్చే సమయంలో పార్టీ రాష్ట్ర నేతలు వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు. దీంతో పార్టీ కోసం 24 గంటలు కష్టపడిన వారిని కాదని టికెట్ కావాలని అప్లికేషన్ కూడా పెట్టని వారికి టికెట్ కేటాయించడం అన్యాయమన్నారు. ఇందులో.. అప్లికేషన్ పెట్టని 40మందికి టికెట్లు ఇచ్చారని గాలి అనిల్ కుమార్ ఆరోపించారు. బీసీలకు న్యాయంగా 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ మొండిచెయ్యి చూపించింది. కాంగ్రెస్‌లో కష్టపడిన వారికి న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి మేరకు, వారి మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్యానికి, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
Farzi : మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ గా నిలిచిన ఫర్జి..
- Tags
- bjp
- BRS
- cm kcr
- congress
- Congress leaders
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!