BJP MP Candidates: బీజేపీ నాయకత్వం ఐదో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ రెండు స్థానాలను ఇన్ని రోజులు పెండింగ్‌లో ఉంచిన హైకమాండ్.. ఈ లిస్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. ఖమ్మం అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావును ప్రకటించారు. అలాగే ఇటీవలే పార్టీలో చేరిన అరూరి రమేష్ ను వరంగల్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. ఇన్ని రోజులుగా ఈ రెండు స్థానాలపై నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. వరంగల్ టికెట్ కోసం కృష్ణ ప్రసాద్, అరూరి ప్రయత్నాలు చేయగా, చివరకు పార్టీ అరూరి రమేష్‌ను ఎంపిక చేసింది. అలాగే ఖమ్మం సీటు కోసం కాషాయ పార్టీలో చేరిన జలగం వెంకటరావుకు నాయకత్వం మొండిచేయి చూపింది. తాండ్ర వినోద్‌రావుకు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. దీంతో ఈ రెండు స్థానాలపై ఉత్కంఠ వీడింది.
Reada also: Houthi Rebels: చైనా ఆయిల్ నౌకపై హౌతీ రెబల్స్ దాడి..
టికెట్ ఆశించి పార్టీలో చేరిన జలగం పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఆయనకు పార్టీ ఎలా న్యాయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక వినోద్ రావు తాండ్ర స్వగ్రామం కొత్తగూడెం – భద్రాద్రి జిల్లా ముల్కలపల్లి మండలం తిమ్మంపేట. వినోద్ రావు గత దశాబ్దానికి పైగా సోషల్ వర్కర్ గా పలు స్వచ్ఛంద సంస్థలలో ఉన్నత బాధ్యతలు సమర్థంగా నిర్వహించి పేదలకు సేవ చేశారు. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూనే 2015 నుంచి 2021 వరకూ ఏకలవ్య ఫౌండేషన్ తరఫున విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం వంటి రంగాల్లో సేవలందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో వారి నాయకత్వంలోని ఫౌండేషన్ అద్భుతమైన సేవ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా లో గిరిజనుల అభ్యున్నతి కోసం చేసిన కృషి పలువురి ప్రసంశలు అందుకుంది.
JP Nadda : బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ