Hyderabad: హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వాహనదారులు ఇబ్బంది పడేది ట్రాఫిక్‌తోనే. ట్రాఫిక్ కారణంగా ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు వెళ్తుంటారు. ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంది. ట్రాఫిక్ వల్ల కొంతమంది నరకం చూస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కంటే ఎక్కువగా ఛలానాలపైనే దృష్టి పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై కెమెరాలు పట్టుకుని కూర్చుని, టపాటపా ఫొటోలు తీస్తున్నారు కానీ ట్రాఫిక్ గురించి పట్టించుకోవట్లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొందరు పోలీసులైతే వాహనదారులకు కనిపించకుండా ఎక్కడో నిలబడి క్లిక్‌మనిపిస్తున్నారు. దీంతో సాయంత్రానికి ఛలానాల సమాచారం ఫోన్లకు సందేశాల రూపంతో చేరుతోంది.
Read Also: Interesting Facts: నదుల్లో కాయిన్స్ ఎందుకు వేస్తారో మీకు తెలుసా?
అయితే తమపై ఉన్నతాధికారులు టార్గెట్ విధిస్తున్నారని.. అందుకే ట్రాఫిక్ కంటే ఛలానాలపైనే ఎక్కువ దృష్టి సారించాల్సి వస్తోందని కొందరు ట్రాఫిక్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు తమ ఫస్ట్రేషన్‌ను వాహనదారులపై చూపిస్తున్నారు. నిబంధనల పేరుతో వాహనానికి మిర్రర్ లేకపోయినా, పిలియన్ రైడర్‌కు హెల్మెట్ లేకపోయినా, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా పోలీసులు ఛలానాలు విధిస్తున్నారు. మొత్తానికి టార్గెట్ల ద్వారా ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తంలో ప్రతిరోజూ ఛలానాల కోసం ఫోటోలను క్లిక్ చేస్తున్నారని.. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Dear @CPHydCity @HYDTP @JtCPTrfHyd do youu set targets for your traffic inspectors? a traffic SI called for me paying my challans (who took my number at a traffic signal in the morning). He mentioned, he has to report how much he collected by 7 PM, started with arrogance 1/2
— Anil KB -CFP 🇮🇳🕉️💵 (@anilbatchu) September 1, 2022