Hyderabad: హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వాహనదారులు ఇబ్బంది పడేది ట్రాఫిక్‌తోనే. ట్రాఫిక్ కారణంగా ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు వెళ్తుంటారు. ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంది. ట్రాఫిక్ వల్ల కొంతమంది నరకం చూస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కంటే ఎక్కువగా ఛలానాలపైనే దృష్టి పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై కెమెరాలు పట్టుకుని కూర్చుని, టపాటపా ఫొటోలు తీస్తున్నారు కానీ ట్రాఫిక్…