CLP Leader Mallu Bhatti Vikramarka Clarify About Party Senior Leaders Meeting.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో పార్టీ సీనియర్ల సమావేశం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సమావేశంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచామన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అని చర్చించామన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వస్తే కూడా..వదులుకున్నారన్నారు. పార్టీ నిర్మాణం కోసం సోనియా గాంధీ నిర్ణయం ఆహ్వానిస్తున్నామని, కాంగ్రెస్ భావజాలం కాపాడి త్యాగాలు చేసింది గాంధీ ఫ్యామిలీ అని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ ఫ్యామిలీ త్యాగాలతోనే కపిల్ సిబాల్ 10 ఏండ్లు మంత్రి అయ్యారని, సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు.
మా సీనియర్ నాయకుల భేటీ కూడా దీని గురించేనని, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లడం కామన్ అని ఆయన స్పష్టం చేశారు. ఫిర్యాదుల అంశం నాకు తెలియదు .. చూడలేదని ఆయన అన్నారు. సీనియర్ నేతల సమావేశం కూడా రాహుల్ గాంధీ నాయకత్వం కోసమేనని, కాంగ్రెస్ బలంగా ఉందని, మళ్లీ దేశంలో తిరిగి అధికారం లోకి వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.