Bhatti vikramarka: 74వ రోజుకు చేరిన పీపుల్స్ మార్చ్.. మధ్యాహ్నం మీడియా ముందుకు భట్టి, మల్లు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర 74వ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో కొనసాగనుంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల కేంద్రం నుంచి ఈరోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. తాడూరు, గగ్గలపల్లి, మంతటి క్రాస్ రోడ్, దేశిట్క్యాల్ గ్రామాల వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంతటి క్రాస్ రోడ్ వద్ద సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మీడియాతో మాట్లాడుతారు. ఈరోజు మధ్యాహ్నం మంతటి క్రాస్ రోడ్ వద్ద లంచ్ బ్రేక్ ఉంటుందని తెలిపారు. దేశిట్క్యాల గ్రామంలో ఈరోజు రాత్రికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం బస చేస్తారు.
నిన్న నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ వద్ద 73వ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్‌లోని అంకన్పల్లితండా, కారుకొండతండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా, అంకన్పల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయన్నారు. ఇక్కడ నివసించే వారందరూ 100% దళితులు మరియు గిరిజనులు. ప్రభుత్వం తమ బాధ్యతను మరిచి మానవత్వంతో వ్యవహరిస్తూ భూమికి భూమి, ఇంటింటికి, ఉద్యోగం కల్పిస్తోందని విమర్శించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం హామీపై నిర్వాసితులంతా సంతకాలు చేశారని, ఇప్పుడు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దీంతో ఊరు, భూమి, ఇల్లు, ఉపాధి కోల్పోయి నిర్వాసితులకు దిక్కులేకుండా పోయింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు భూమి, ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
IMD Hyderabad: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలే.. ఐఎండి వెల్లడి
Also Read
తాజావార్తలు
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు?
-
Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!