Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్యే దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు.. ఈ ఇద్దరి ప్రేమ వివాహం హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే నిర్వహించారు.. ఇక, ఈ జంట తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకల్లో మెరిసింది.. తిరుపతిలో నిర్వహించిన ఆ కార్యక్రమానికి మంచు ఫ్యామిలీ మొత్తం పాల్గొంది.. మనోజ్ కూడా తన భార్య మౌనికతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ కొత్త జంట ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోగా.. మరోవైపు.. మంచు మనోజ్ తన భార్యను ఉద్దేశించి చెప్పిన మాటలతో.. ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు మౌనిక..
ఇంతకీ మౌనిక ఎమోషన్‌కు గురైన ఆ మాట ఏందనే విషయంలోకి వెళ్తే.. మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మనోజ్ మాట్లాడుతూ.. జీవితంలో గెలుపోటములు సహజం.. అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో అందకారం చుట్టేస్తోంది.. నాకు కూడా గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది.. కానీ, ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది.. ఆ చీకటి కమ్ముకున్నప్పుడు నాకు వెలుతురులా మౌనిక కనిపించింది.. అంటూ కాస్త ఎమోషనల్‌కు లోనయ్యాడు.. తన తండ్రి, భార్య గురించి మాట్లాడిన మనోజ్.. నేను ప్రేమించిన అమ్మాయి స్వేచ్ఛగా ఉండాలి.. తన డ్రీమ్స్ ని వెతుక్కోవాలి. తాను ఏం చేయాలన్నా నేను సపోర్ట్ ఇవ్వాలని.. ప్రతి మగాడి గెలుపు వెనుకాల ఆడవారు ఉంటారు.. అదే విధంగా ఆడవారి విజయం వెనుక కూడా మగాళ్లు ఉండాలి అన్నారు.. మనోజ్ అలా మాట్లాడుతుంటే ఆయన భార్య మౌనిక సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు..
ఇక, మా నాన్న గారు నాకు అన్ కండీషనల్ లవ్ ఇచ్చారని తెలిపారు మనోజ్.. నేను ఎన్నోసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టాను. కానీ, ఎప్పుడూ ఆయన ప్రేమ మాత్రం తగ్గలేదు.. నాన్న నేను ఒక అమ్మాయికి మాటిచ్చాను.. జీవితాంతం తోడుగా ఉంటానని అని చెబితే.. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని నాన్న చెప్పారు.. మా నాన్న మౌనిక నా మూడో కూతురు అని అన్నారు… ఇలాంటి నాన్న రుణం తీర్చుకోలేను అంటూ మరోసారి ఎమోషనల్ గా మాట్లాడారు మనోజ్.. కాగా, పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనోజ్ దంపతులు.. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఎప్పటికైనా ప్రేమనే గెలుస్తోంది. ఇప్పుడు నా ప్రేమ కూడా గెలిచింది. అందరి ఆశీర్వాదాలు మాకు అందాయి. ఇక నేను పోస్ట్ చేసిన శివుని ఆజ్ఞ గురించి చెప్పాలంటే.. ఆ శివుడే వీరిద్దరిని నాకు అప్పగించాడు. నేను చేసిందేమి లేదు.. అంతా శివుడి ఆజ్ఞ.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే.. వారిని బాగా చూసుకోవాలి. నేను, మౌనిక ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నాం. ఇక నేను ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోతానని వ్యాఖ్యానించిన విషయం విదితమే.