Bhatti Vikramarka: బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka Fires On TRS BJP Parties: అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుడికి ఓటు హక్కు కల్పిస్తే.. ఆ రెండు పార్టీలు మాత్రం సామాన్యుల ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకొని ప్రలోభపెడుతున్నాయని ఆగ్రహించారు. అసలు వారి వద్ద వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇతర ఎమ్మెల్యేల లాగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కోట్లు పోగేసుకున్న వ్యక్తి కాదని.. ఆ విలువలు ఉన్న పాల్వాయి స్రవంతిని గెలిపించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని కోరారు. వెలకట్టలేని మీ ఓటును.. వెలకట్టి అమ్ముకోవాలనుకున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
బీజేపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు, ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రలోభ పెట్టారనే వార్తలు విన్నామని.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదని భట్టి విక్రమార్క చెప్పారు. మధ్యప్రదేశ్‌లో గానీ, కర్ణాటకలో గానీ.. బీజేపీ ఇతర ప్రజా ప్రతినిధుల్ని కొనలేదా? ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనలేదా? అని నిలదీశారు. ఇది ఎవరి కుట్రనో అందరికీ తెలుసని.. రెండు పార్టీలూ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు కొనుగోలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నలుగురా? 40 మందా? అనేది పక్కన పెడితే.. వందల కోట్లు ఖర్చు పెడుతున్న వారి వద్దకు, అంత డబ్బు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు భారీ డబ్బులు ఖర్చు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు.
Also Read
ఇదే సమయంలో బండి సంజయ్‌పై కూడా భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న బండి సంజయ్.. ఇంతవరకు ఏం అభివృద్ధి చేశారు? కంపెనీలు పెట్టారా? ప్రభుత్వ రంగ సంస్థల్ని స్థాపించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం మతం పేరుతో రెచ్చగొట్టి, రాజకీయ లాభం పొందెందుకు బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క ఈ స్థానంతో ఏ ప్రభుత్వమూ పడిపోందని, ఇంత విచ్చల విడితనం ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!