Bhatti Vikramarka: రాష్ట ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం త్వరలో విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఉన్నతి పదవి చేపట్టానని తెలిపారు. మధిరప్రజలందరి కృతజ్ఞతలు అన్నారు. ఈ నెల 14 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని అన్నారు. చారిత్రాత్మక విజయం తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ సమాజం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారని తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా అంత అస్తవ్యస్తం అన్నారు. రాష్ట్ర సంపద అంతా దోపిడీ గురైందన్నారు. పూర్తిగా 10 ఏళ్ళల్లో రాష్ట్రం 70 ఏళ్ళు అభివృద్ధిలో వెనకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయంలో ఫీడల్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. ప్రభుత్వంలో ఉన్నా ప్రతి వ్యవస్థ ప్రజలకోసంమే పనిచేసేలా పాలనా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
Read also: IND vs SA: బీసీసీఐ అంత కాకపోయినా.. కవర్స్ కొనేంత డబ్బు దక్షిణాఫ్రికా వద్ద లేదా?
భారత రాజ్యంగా స్పూర్తితో పాలనా అందిస్తామని తెలిపారు. కుట్రపూరితమైన పాలనకు చరమగీత పాడారని హర్షం వ్యక్తం చేశారు. మండల, జిల్లా స్థాయిలో ప్రజా దర్బార్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిస్కారం చేస్తామని తెలిపారు. రాష్ట ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. అంతేకాకంఉడా.. ఆరు గ్యారంటీల్లో 2 గ్యారంటీలను 2 రోజుల్లోనే ప్రారంభించామన్నారు. రాష్ట్ర వనరులు సంపద సృష్టికి ఉపయోగపడతాయన్నారు. సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే కాంగ్రెస్ ఎజెండా అని తెలిపారు. పరిశ్రమలు, ఐటీ, సేవా రంగాలను ప్రోత్సహిస్తామన్నారని తెలిపారు. తొలి వంద రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరిన్ని హామీలను పొందుపరిచామని అన్నారు. ఆరు హామీలకు ఎలాంటి హామీ లేదని బీఆర్ఎస్ విమర్శించింది. వారంటీ లేదన్న పెద్దలకు చెంపదెబ్బ తగిలేలా ప్రజలు చేశారు భట్టి వ్యాఖ్యానించారు.
AP Crime: ఏం కష్టం వచ్చిందో..? నెల రోజుల క్రితం పెళ్లి.. సముద్రంలోకి వెళ్లిపోయిన యువజంట..