AP Crime: ఏం కష్టం వచ్చిందో..? నెల రోజుల క్రితం పెళ్లి.. సముద్రంలోకి వెళ్లిపోయిన యువజంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ యువ జంట అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయింది.. ఆ బీచ్‌లో ఉన్నవాళ్లు అంతా చూస్తుండగా.. సముద్రంలోకి వెళ్లారు.. వెనక్కి రావాలంటూ అక్కడున్నవాళ్లు ఎంత అరచినా పట్టించుకోకుండా వెళ్లిపోయి.. గల్లంతయ్యారు.. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: IND vs PAK: పాకిస్తాన్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే..!
Also Read
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయితే, కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చారు ఆ నవ దంపతులు.. ఇద్దరు చేతులకు చున్నీ కట్టుకుని అంతర్వేది బీచ్ సమీపంలో 500 మీటర్ల దూరంలో అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయారు.. వారు సముద్రంలోనకి వెళ్తున్న దృశ్యాలను చూసిన బీచ్‌లో ఉన్నవారు.. వారిని వారించే ప్రయత్నం చేశారు.. వెనక్కి రావాలంటూ కేకలు వేశారు.. అయినా ఆ ఇద్దరు అలా సముద్రంలోకి వెళ్లి అదృశ్యమయ్యారు.. దీంతో, సమీపంలో ఉన్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ఇప్పటి వరకు ఆ యువ జంట జాడ చిక్కలేదు.. సముద్రం ఒడ్డున వదిలిన ఫోన్ ఆధారంగా పేరెంట్స్ కు సమాచారం ఇచ్చిన సఖినేటిపల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?