Komati Reddy Venkat Reddy: ఎంపీ పదవికి కోమటిరెడ్డి రాజీనామా.. గడ్కరితో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komati Reddy Venkat Reddy: రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ డిల్లీకి వెళ్లనున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నారు. నిన్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ళ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అన్నారు. అమెరికా ఈజ్ గ్రేట్… అమెరికన్ రోడ్స్ ఈజ్ గ్రేట్ అని పొగడ్తలతో ముంచేశారు. నాకు రోడ్లు భవనాలు శాఖ ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు. కౌన్సిల్ హాల్ ను షిఫ్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇలా చేసే భాద్యత నాకు అప్పగించారని తెలిపారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపడతామన్నారు.
Read also: Pneumonia Cases: వాతావరణంలో మార్పు.. న్యుమోనియా బారినపడుతున్న పిల్లలు
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
నిన్న తొమ్మిది ముఖ్య ఫైల్స్ పై సంతకాలు చేసానని తెలిపారు.తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లను 100 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చబోతున్నామని తెలిపారు. మా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని.. నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్ తీసుకుని.. తనకున్న పరిచాయలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకు వస్తా అని హామీ ఇచ్చారు. సినిమా వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదని.. ఒక్క దిల్ రాజు మాత్రమే ఫోన్ చేశారని అన్నారు. ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాలన్నారు. పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే ముందే విజయవాడకు వెళ్లే విధముగా చేస్తామన్నారు. కొత్త అసెంబ్లీలో నిర్మాణం లేదని, పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా మారుస్తామన్నారు.
IND vs PAK: పాకిస్తాన్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే..!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!