
భక్తి టీవీ కోటిదీపోత్సవానికి భాగ్యనగరంలో అనూహ్య స్పందన కనిపిస్తోంది. 12వ రోజు కోటి దీపోత్సవానికి గవర్నర్ తమిళి సై హాజరయ్యారు. కోటి దీపోత్సవ ప్రాంగణంలోని శివలింగానికి అభిషేకం, హారతి ఇచ్చారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అక్టోబర్ 31న ప్రారంభం అయిన కోటి దీపోత్సవ సంరంభం 13వ రోజుకి చేరుకుంది. కార్తిక మాసాన దీపాలు వెలుగుతుంటే… ఎన్టీఆర్ స్టేడియం దేదీప్యమానంగా కనిపించింది. ఆధ్మాత్మిక శోభ అణువణువునా సాక్షాత్కరించింది. దగ్గరికి వచ్చి కూర్చుని దీపాలు వెలిగించలేని వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీలు వీక్షిస్తూ అనుభూతి చెందుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలయితే చాలు వాహనాలన్నీ ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు పరుగులు పెడుతున్నాయి. పిల్లా పెద్దా, ఆడా మగా తేడాలేకుండా కోటి దీపోత్సవంలో పాలు పంచుకుంటున్నారు. కోటి దీపోత్సవం ఈనెల 14న ముగుస్తుంది. ఇప్పటివరకూ రానివారు ఒక్కసారి వచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొని తరించండి.

శనివారం 13వ రోజు భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఏముంటాయంటే..
అనుగ్రహ భాషణం: శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అందిస్తారు
ప్రవచనామృతం:ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నండూరి శ్రీనివాస్
వేదికపై పూజ: కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన
భక్తులచే పూజ: ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన
కల్యాణం: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం
వాహన సేవ: సూర్య ప్రభ వాహనం
