Viral News : భద్రాచలంలో ‘బాలభీముడు’.. 5.2 కేజీల బరువుతో శిశువు జననం..
- 5.2 కేజీల బరువుతో ‘బాలభీముడు’ జననం.. స్థానికంగా సంచలనం
- క్లిష్ట ప్రసవం.. అప్రమత్తంగా వ్యవహరించిన వైద్య బృందం
- తల్లి, శిశువు క్షేమం.. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రశంసలు
- మారుమూల ప్రాంతాల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న భద్రాచలం ఆసుపత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సాధారణంగా శిశువులు పుట్టినప్పుడు 2.5 నుండి 3 కేజీల బరువు ఉండటం సహజం. కానీ, ఇక్కడ ఒక మహిళ ఏకంగా 5 కేజీల 200 గ్రాముల బరువున్న ‘బాలభీముడికి’ జన్మనిచ్చింది. ఇంతటి భారీ బరువున్న శిశువు జన్మించడం స్థానికంగా పెను సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రసవం కోసం సంధ్యారాణి అనే గర్భిణీ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు శిశువు బరువు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రసవం చేయడం తల్లికి, బిడ్డకు కొంత రిస్క్తో కూడుకున్న పని అయినప్పటికీ, వైద్య బృందం ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది.
T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్రౌండ్కి ఐసీసీ బిగ్షాక్.. ఏం జరిగిందంటే..?
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
వైద్యులు ఎంతో అప్రమత్తంగా ఉండి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 5.2 కేజీల బరువుతో పుట్టిన ఈ మగ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. తల్లి సంధ్యారాణి కూడా క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అరుదైన కేసులను సమర్థవంతంగా డీల్ చేయడం పట్ల ఆసుపత్రి వర్గాలు , సంధ్యారాణి బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత బరువైన శిశువుకు ఎలాంటి అపాయం కలగకుండా డెలివరీ చేసిన వైద్యులను, సిబ్బందిని ఆసుపత్రి ఉన్నతాధికారులు అభినందించారు. మారుమూల ప్రాంతాల వారికి భద్రాచలం ఏరియా ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తోందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..