Bettings On Munugode By Elections Votes Counting: ఈ నెల 3వ తేదీన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే రేపు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను నల్గొండలోని స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి.. సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. శనివారం డమ్మీ ఈవీఎంలతో మాక్ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. కాగా.. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. రేపు మధ్యాహ్నానికల్లా విజేత ఎవరనే విషయంపై దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు.. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. ఉప ఎన్నిక పోలింగ్ సమయంలోనే రూ. 100 కోట్ల మేర బెట్టింగ్ జరిగనట్టు తెలిసింది. ఐపీఎల్ తరహాలోనే ఎన్నికల బెట్టింగ్ జరిగిందని తేలింది. హైదరాబాద్ హోటల్స్‌లో బూకీలు తిష్ట వేసి.. మధ్యవర్తులుగా ఏజంట్స్‌ను ఏర్పాటు చేసుకొని.. అడ్వాన్స్‌లు చెల్లించారు. ఇప్పుడు ఆయా పార్టీల గెలుపులు.. మెజార్టీలపై బెట్టింగ్‌లపై బెట్టింగ్స్ కాస్తున్నారు. డిపాజిట్ సాధించేదెవరు? కోల్పోయేది ఎవరు? ఎవరికి ఎన్ని ఓట్లు రావొచ్చు? ఏయే పార్టీ ఎంత శాతం ఓట్లు పొందుతాయి? వంటి ప్రతీ అంశంపై కూడా కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పోలీసులు ఈ బెట్టింగ్‌పై పోలీసులు నిఘా పెట్టారు. టాస్కఫోర్స్, ఎస్వోటీ నిఘా పోలీసులు రంగంలోకి దిగారు. అటు.. ఏపీలోని బెట్టింగ్ మాఫియాపై కూడా నిఘా పెట్టారు.