Hyderabad Crime: అర్థరాత్రి యాచకులపై దాడి.. గొంతు కోసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యాచకులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఓ బిచ్చగాడిని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశారు. దుండగులు బిచ్చగాళ్ల నుంచి డబ్బు ఎత్తుకెళ్లారు. దీంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో మధ్యం మత్తులో యాచకుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసేందుకు దారి తీసింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్ వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న యచకుల మధ్య మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో ముగ్గురు యాచకులు కలిసి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో నరికి చంపారు. అంతటితో ఆగకుండా మారేడ్పల్లిలో దేవాలయం వద్ద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో యాచకుడిని కత్తితో పొడిచారు.. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి హత్యకు పాల్పడ్డ ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
ఘటనకు కారకులైన ముగ్గురు సైకో కిల్లర్ ల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఒక యాచకుడు మృతి చెందగా, మరో యాచకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే యాచకుల వద్ద డబ్బు దోచుకునేందుకే హత్య ప్లాన్ వేసుకుని వారిపై దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడే వున్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మద్యం మత్తులో యాచకులపై ఎందుకు దాడి చేశారనేది ఇంకా తెలియరాలేదు. అయితే వారిపై దాడి చేయాలనే ఉద్దేశ్యంతోనే ముందుగా ప్లాన్ వేసుకుని వారిపై కత్తితో దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?