Mallu Bhatti Vikramarka: మోడీ జీ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి.. తెలంగాణలో అడుగుపెట్టండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు,సింగరేణి సంస్థ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెండు లేఖలు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు. ఇక తాజాగా మోడీకి మూడు పేజీలు, 30 ప్రశ్నలతో బహిరంగ లేఖను భట్టి విక్రమార్క విడుదల చేశారు. తను సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాక మోడీ తెలంగాణలో అడుగు పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు.
30 ప్రశ్నలతో బహిరంగ లేఖ
Also Read
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
- Jagadish Reddy : పవన్ వ్యాఖ్యలు ఐటెం సాంగ్స్లాంటివే.. జగదీష్ రెడ్డి సెటైర్లు.!
1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా?
2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ 9 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? దీనిపైన కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
3. మీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో 20 వేల కోట్లతో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించిన కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? తెలంగాణ ప్రజలపట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారు?
4. బయ్యారంలో ఉక్కుకర్మాగారం పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు? దీనిపైన స్పష్టతను ఇస్తారా?
5. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారు? ఈ నిధులు 2019 నుండి నిలిపివేయడానికి కారణాలు ఏమిటి?
6. మీరు అధికారం చేపట్టిన ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అయినా జాతీయో హోదా ఇచ్చారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అయిన పాలమూరు`రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు.
7. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఎటిఎం గా మారిందని విమర్శలు చేసే మీరు, మీ కేంద్రమంత్రులు, మీ పార్టీవారు దీనిపైన సిబిఐ లేదా ఇతర సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదు? మీకు కేసీఆర్‌కు, బిజెపికి, బీఆర్‌ఎస్‌కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటి?
8. కేంద్రమంత్రిగా శ్రీ కేసీఆర్‌గారు పనిచేసినప్పుడు పాల్పడిన సహారా, ఇ.ఎస్.ఐ స్కామ్‌లపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఈ స్కామ్‌లపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
9. 2014 లో మీరు ప్రధానమంత్రి అయినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యాసంస్థలను తెలంగాణలో ఎందుకు నెలకొల్పలేదు? ముఖ్యంగా ఐ.ఐ.ఎం, ఐ.ఎస్.ఆర్, ఎన్.ఐ.డి, ట్రిపుల్ ఐటి, నవోదయ విద్యాలయాలు కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు?
10. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు? బిజెపి పాలిత రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు? దీనిపైన మీ సమాధానం ఏమిటి?
11. తెలంగాణ రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటివాటా కేటాయింపుల విషయంలో ఎందుకు కేంద్రప్రభుత్వం తాత్సర్యం చేస్తోంది? సాగునీటి వాటాల కేటాయింపులపై ట్రిబ్యునల్లకు ఎందుకు రిఫర్ చేయడం లేదు?
12. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన నిధులను కూడా ఏవో సాకులు చెప్పి ఎందుకు నిలిపివేస్తున్నారు?
13. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించినప్పుడు బిజెపి పాలిత రాష్ట్రాలకు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంత సహాయం అందించారు? తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారు?
14. తెలంగాణ రాష్ట్రానికి ఈ 9 ఏళ్ల కాలంలో జాతీయ స్థాయి ఉన్న ఒక్కవిద్యాసంస్థ కానీ, మెడికల్ కళాశాలలు కానీ మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారా?
15. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయంను ఎప్పుడు ప్రారంభిస్తారు?
16. తెలంగాణలో అనేక డిఫెన్స్ సంస్థలున్నాయి? ఈ రాష్ట్రంలో ఢపిెన్స్ క్యారిడార్ కేంద్రప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదు?
17. నిజామాబాద్ పసుపు బోర్డు ఎప్పటి లోగా ఏర్పాటు చేస్తారు?
18. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధమున్న మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు? మీకు, కేసీఆర్‌కు మ్యాచ్‌ఫిక్సింగ్ అయ్యిందా?
19. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన తరువాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలీండర్ ధరలు పెంచనని మీరు హామీ ఇవ్వగలరా? 2014 నుండి ఇప్పటివరకు ఈ 9 సంవత్సరాల కాలంలో వీటిపైన ఎన్నిసార్లు ధరలు పెంచారు?
20. 2014 ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమచేస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారు?
21. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారు? ఇప్పటి వరకు ఎన్నికోట్ల ఉద్యోగాలను మీరు అధికారంలోకి వచ్చిన తరువాత కల్పించారు?
22. మీకు, అదానికి ఉన్న సంబంధం గురించి తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు? దీనిపైన ఇప్పటికైనా నోరు విప్పుతారా?
23. అదాని పాల్పడ్డ కుంభకోణాల్లో మీ పాత్ర ఉందా? లేదా? ఈ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు?
24. మీ విద్యార్హతల గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డిగ్రీ సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తీర్పు ఇచ్చిన వ్యక్తి మా తెలంగాణ బిడ్డ. మీరు పాల్గొనే బహిరంగ సభలో మీరు మీ సర్టిఫికేట్‌ను ప్రజల సమక్షంలో చూపడానికి సిద్ధమా? కనీసం మీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయినా మీ సర్టిఫికేట్‌ను షేర్ చేయగలరా?
25. 2014 లో మీరు అధికారం చేపట్టినప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు? ఎన్ని కొత్తగా ప్రారంభించారు? దీనిపైన వివరణ ఇవ్వగలరా?
26. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌కు మంజూరు అయిన ఐటిఐఆర్ (ఇంటిగ్రేటేడ్ ఇన్వెస్టిమెంట్ టెక్నాలజీ రీజియన్) ఎందుకు రద్దు చేశారు? దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకున్న కార్యక్రమాలు ఏంటి?
27. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత తెలంగాణలోని హైదరాబాద్ నగరం సాఫ్ట్‌వేర్ రంగానికి పుట్టినిల్లు. తెలంగాణ రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్టులు ఎందుకు ఇవ్వడం లేదు?
28. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రఖ్యాత ఫార్మాకంపెనీలున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కూడా తెలంగాణలోని ఫార్మా కంపెనీయే కీలకపాత్ర పోషించిన విషయం మీకు తెలియంది కాదు. అంత ప్రాధాన్యత ఉన్న తెలంగాణకు ఫార్మాసిటిలకు కేంద్రప్రభుత్వం ఎందుకు సహాయం చేయడం లేదు?
29. ట్రెడీషనల్ మెడిసన్ సెంటర్‌ను హైదరాబాద్ నుండి మీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
30. బిజెపి – బీఆర్‌ఎస్ ఉన్న లోపాయకారి ఒప్పందాలను మీరు వెల్లడిరచగలరా? మీ కనుసన్నల్లోనే బీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తున్నదన్న విషయం వాస్తవం కాదా? బిజెపికి – బీఆర్‌ఎస్, ఎఐఎంఐఎం ఇంకా కొన్ని పార్టీలు ‘బి’, మరియు ‘సి’ టీమ్‌లుగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.
Online games: ఆన్లైన్ గేమ్ లకు బానిసై.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..
-
Mokshagna : నందమూరి మోక్షజ్ఞకు యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదా?
-
Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
-
Honda SP 125 vs TVS Raider 125: మైలేజీలో హోండా, ఫీచర్లలో టీవీఎస్.. 125cc సెగ్మెంట్లో ఈ రెండు బైక్‌లలో నంబర్ 1 ఏది?
-
Samantha : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అంటే సమంత మాత్రమే.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!