HYD : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 1/12లో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వర్షాల ప్రభావంతో రోడ్డు ఆకస్మాత్తుగా కుంగిపోవడంతో, ఆ మార్గంలో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ , క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , జీహెచ్ఎంసీ సిబ్బంది గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…