Bandi sanjay: అక్కడ నిర్మాణం ఎలా చేపడతారు? కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay letter to CM KCR: నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములపై బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేక రాశారు. నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలోని సర్వే నెంబర్ 543, 544, 969 లోని అటవీ భూమిని వృత్తి విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుమారు 3.373 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఆమోదం తెలిపిందని అన్నారు. ఆయా అటవీ భూములను సైతం డీనోటిఫై చేసిందే నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం… అటువంటి భూమిని మీ స్వార్ధ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం కేటాయించడం చట్ట విరుద్దమన్నారు.
ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రార్థనా స్థలాలకు కేటాయించడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అంతేగాకుండా ఏ ప్రజా ప్రయోజనాల కోసమైతే భూములను కేటాయిస్తారో ఆ ప్రజా ప్రయోజనాలకు మాత్రమే సదరు భూమిని వినియోగించాలే తప్ప అందుకు భిన్నంగా ఇతర ప్రయోజనాలకు వినియోగించడం చట్ట విరుద్ధమన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సహా పలు కోర్టులు ఈ మేరకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులే పాలకులకు అనుసరణీయమన్నారు. అయినప్పటికీ కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలోని చించోలిలో ఈద్గాను నిర్మించడమంటే న్యాయ వ్యవస్థను అవమానించినట్లే. ఇది ముమ్మాటికీ కోర్టు థిక్కరణే. రాజ్యాంగాన్ని ధిక్కరించరమే అని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించబడిన ఫారెస్ట్ భూములను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం నీచమైన పని. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్‌గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ఈద్గా ప్రార్ధన కోసం ప్రభుత్వం ప్రారంబించాలనుకుంటున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలో రెండు హిందూ దేవాలయాలున్న విషయం మీ దృష్టిలో లేదనుకోలేను. నిరుద్యోగ యువత కోసం కేటాయించిన భూమిని ప్రార్థనా స్థలాలకు కేటాయించడం ఒక పొరపాటు అయితే.. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం స్వయంగా పూనుకోవడం క్షమించరాని నేరమన్నారు. ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఒక మతానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం మీ స్వార్ధ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ప్రభుత్వ భూములను మతపరమైన కార్యక్రమాలకు వినియోగించకూడదని స్పష్టమైన నిబంధనలున్నప్పటికీ ఆ భూములను ఈద్గా నిర్మాణానికి కేటాయించడం దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ ఆ నిర్మాణ పనులను స్వయంగా ప్రారంభించేందుకు ఈ రోజు ఆ ప్రాంతానికి వెళుతుండటం బాధాకరమన్నారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రులుగా కొనసాగుతూ ఆ రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ తీర్పులను ధిక్కిరంచడం దుర్మార్గ చర్య. ఈ విషయం తెలిసి కూడా మీరు సైతం అటువంటి చట్ట వ్యతిరేక పనులకు సహకరిస్తున్నట్లు కన్పిస్తుండటం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా చట్టాలను, న్యాయస్థాన తీర్పులను ధిక్కరిస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును బలి చేసే చర్యలను బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన అధికారులు సైతం మౌనం వహిస్తుండటం బాధాకరమని తెలిపారు. మీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది.
అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉపాధి శిక్షణలోనైనా వారికి అందాల్సిన కనీస సౌకర్యాలను దూరం చేసే చర్యలకు పాల్పడకండి. కేంద్ర ప్రభుత్వం ,కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు బేఖాతారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఇకనైనా వృత్తి విద్య, నైపుణ్యం అభివృద్ధి కోసం కేటాయించబడిన భూమిని అదే ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నాను. దీనికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతోపాటు ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధం. ప్రజాక్షేత్రంలోనూ మీ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నామని తెలిపారు.
DAV school incident: డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనలో కోర్టు తీర్పు.. 20 ఏళ్ల జైలు శిక్ష
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్‌తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?