తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్రవిమర్శలు చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ను బీజేపీ గళ్ళ పట్టి గుంజుతేనె బయటకు వచ్చాడన్నారు. జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో కెసిఆర్ తిరుగుతున్నాడు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేసి తీరుతాం అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించుకోవాలి. పాతబస్తీలో గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి కేసీఆర్, అసదుద్దీన్ లు ఎందుకు హాజరుకావటం లేదు. ముస్లిం, క్రిస్టియన్ పండుగలకు సోదరసోదరీమణులంటూ ఫ్లెక్సీలు కడతారు. హిందువుల పండుగలకు మాత్రం హిందుబంధువులు, సోదరసోదరీమణులంటూ శుభాకాంక్షలు చెప్పే ధైర్యం టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు బండి సంజయ్.