Bandi sanjay: కాంగ్రెస్ మునిగిపోయే నావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: కాంగ్రెస్ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఇవాల ఉదయం జిల్లాలోని 57వ డివిజన్ లో బండి సంజయ్ పర్యటించారు. మోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారు. మీరు కట్టుకున్న ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అన్నారు. ‘‘నేను బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిస్తే.. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ ఎలా గెలిచారు? అతను అడిగాడు. పొన్నం ప్రభాకర్‌కు అసలు డిపాజిట్ వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని బండి సంజయ్ అన్నారు.
Read also: Global Gender: లింగ సమానత్వంలో భారత్ స్థానం మెరుగుపడింది
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. మహా జన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ‘ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. రాష్ట్రంలో ప్రతిరోజూ 35 లక్షల కుటుంబాలను కలువనున్నారు బీజేపీ నేతలు. ఇవాళ పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వరకు అందరూ ఈరోజు తమ నియోజకవర్గాల ప్రజలను కలుస్తారు. రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలు ఉండగా, ఒక్కో బూత్ కమిటీ అధ్యక్షుడు తమ పోలింగ్ కేంద్రంలో కనీసం వంద కుటుంబాలను కలుస్తారు. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్ లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్ లోని ప్రజలను బండి సంజయ్ కలుస్తూ నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ.. కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
H-1B Visa: మోడీ పర్యటన వేళ.. భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పనుందా..?
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!