Bandi Sanjay: బండి సంజయ్ రాజీనామా.. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Resigned As BJP State President: తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారాలు నిజమే అయ్యాయి. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమించారు. దీంతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన అనంతరం.. బండి సంజయ్ తన రాజీనామాను ప్రకటించారు. మరికొన్ని నెలల్లోనే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో.. అధ్యక్ష పదవికి సంబంధించి మార్పులు చేయడం వెనుక గల కారణాలేంటో బండి సంజయ్‌కి జేపీ నడ్డా వివరించారు. ఇకపై ఆయన సేవల్ని పార్టీ పెద్దలు కేంద్రంలో వినియోగించుకోనున్నట్టు తెలిసింది.
NCP Crisis: బీజేపీతో కలవాలని ఎమ్మెల్యేలంతా శరద్ పవార్‌ని కోరారు.. ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
ఒక్క తెలంగాణలోనే కాదు.. పలు రాష్ట్రాల అధ్యక్షులను సైతం బీజేపీ అధిష్టానం మార్చింది. ఏపీలో సోము వీర్రాజుని తొలగించి, ఆయన స్థానంలో మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో.. జులై 4వ తేదీన మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు సోము వీర్రాజు. మీ టర్మ్ అయిపోయిందని, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జేపీ నడ్డా తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని సోము వీర్రాజు అన్నారు. కొత్త బాధ్యతల్ని అప్పగిస్తామని తనకు హామీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా.. 2020 జులై 27వ తేదీ సోము వీర్రాజు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, 2023 జులై 4వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు.
Harbhajan Singh: నిన్న విషెస్.. ఇవాళ ట్రోల్స్.. ఏంటీ భజ్జీ ఇలా చేశావు..!
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!