సింగం, సండే, గోల్మాల్, సన్నాఫ్ సర్దార్, దృశ్యం, దృశ్యం 2… వందకి పైగా సినిమాలు చేసిన అజయ్ దేవగన్ ఇచ్చిన రీమేక్ హిట్స్ ఇవి. దాదాపు 10 సౌత్ సినిమాలని రీమేక్ చేసిన అజయ్ దేవగన్ ఆరు సూపర్ హిట్స్ ఇచ్చాడు. రీమేక్ సినిమాలతో మంచి హిట్స్ కొట్టడం అజయ్ దేవగన్ కి తెలిసినంతగా మరొకరికి తెలియదు. సింగం, దృశ్యం 2 సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాడు అజయ్ దేవగన్. ఈ కాన్ఫిడెన్స్ తోనే అజయ్ దేవగన్ ‘ఖైదీ’ సినిమాని ‘భోలా’గా రీమేక్ చేస్తున్నాడు అనగానే అందరూ హిట్ గ్యారెంటీ అనుకున్నారు. అజయ్ దేవగన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన భోలా సినిమాపై బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భారిగానే హోప్స్ పెట్టుకున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచో ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవడంతో భోలా సినిమా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ మార్చ్ 30న రిలీజ్ అయిన భోలా సినిమా నష్టాల వైపు పరిగెడుతోంది. ఫస్ట్ డే మ్యాట్నీ నుంచే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ లో హ్యూజ్ డ్రాప్ కనిపించింది.
ఓవరాల్ గా ఇప్పటివరకూ భోలా సినిమా 58 కోట్లు మాత్రమే రాబట్టింది. వంద కోట్ల బడ్జట్ తో రూపొందిన భోలా సినిమా పెట్టిన డబ్బులు కూడా రికవర్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి కారణం అజయ్ దేవగన్ ఖైదీ సినిమాకి చేసిన మార్పులే. లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమాని చాలా ప్యాక్డ్ గా రాసుకున్నాడు, అంతే ప్యాక్డ్ గా తెరకెక్కించాడు కూడా. అజయ్ దేవగన్ మాత్రం లావిష్ గా తెరకేక్కించాలి అనే ఆలోచనలో భోలాని 3D ఫార్మాట్ లోకి మార్చాడు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టాడు, పాటలు ఇరికించాడు, కథలోకి అనవసర ఎలిమెంట్స్ చాలా తెచ్చాడు. వీటి వలన ఒక టైట్ ప్యాక్స్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా కంప్లీట్ గా డైల్యూట్ అయ్యింది. దాని కాన్సీక్వెన్స్ ఇప్పుడు అజయ్ దేవగన్ ఫేస్ చేస్తున్నాడు. అందుకే దేంట్లో పడితే దాంట్లో వేలు పెట్టకూడదని పెద్దలు అంటూ ఉంటారు. దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లాగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ రీమేక్ చేసి ఉంటే అజయ్ దేవగన్ ఈరోజు ఒక సాలిడ్ హిట్ చూసే వాడు.